టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల సర్వైవల్ థ్రిల్లర్ ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)లో కథానాయకుడిగా నటించారు. ది గోట్ లైఫ్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో దాని ఓటిటి అరంగేట్రం కోసం సిద్ధమవుతోంది. ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ, విపిన్ దాస్ దర్శకత్వం లో తెరకెక్కుతోంది.
గురువాయూర్ అంబలనాదయిల్ అనే ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో మరో హిట్ ను అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ పొంది క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. బాసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనశ్వర రాజన్, సిజు సన్నీ, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మరియు E4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించాయి. మే 16, 2024న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి అంకిత్ మీనన్ సంగీతం అందించారు.