“సారంగపాణి జాతకం” తో వస్తున్న ప్రియదర్శి!

“సారంగపాణి జాతకం” తో వస్తున్న ప్రియదర్శి!

Published on Aug 25, 2024 2:02 PM IST

నటుడు, కమిడియన్ ప్రియదర్శి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరిసారిగా డార్లింగ్ చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు. అయితే నేడు తన పుట్టిన రోజు సందర్భంగా, తన నెక్స్ట్ మూవీకి సంబందించిన టైటిల్ ను ప్రకటించాడు. సారంగపాణి జాతకం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేసారు మేకర్స్.

అయితే టైటిల్ తో పాటుగా, ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పోస్టర్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రూప కొడువాయూర్ కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటుడు కే. నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, శివన్నారాయణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు