“RRR” పై ప్రియాంకా చోప్రా షాకింగ్ స్టేట్మెంట్ వైరల్.!

“RRR” పై ప్రియాంకా చోప్రా షాకింగ్ స్టేట్మెంట్ వైరల్.!

Published on Mar 29, 2023 3:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” అయితే పాన్ వరల్డ్ లెవెల్లో సెన్సేషన్ ని నమోదు చేసింది. అయితే ఈ సినిమా తెలుగు సినిమాగా అలాగే భారతీయ సినిమాకి కూడా ఎంతో గర్వకారణంగా నిలిచింది.

కానీ ఈ సినిమా విషయంలో అయితే కొందరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా మంది దీనిని బాలీవుడ్ సినిమానే అని అంటున్నారు. అలా లేటెస్ట్ గా ఓ హాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూ లో ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా అయితే ఆ ఇంటర్వ్యూయర్ కూడా RRR చిత్రాన్ని హాలీవుడ్ సినిమాగానే మాట్లాడగా ఆమె వెంటనే కరెక్ట్ చేస్తూ RRR సినిమాగా బాలీవుడ్ సినిమా కాదని అది తమిళ సినిమా అంటూ కామెంట్స్ చేసింది.

దీనితో ఈ షాకింగ్ స్టేట్మెంట్ ఆశ్చర్యకరంగా మారింది. RRR అనేది తెలుగు సినిమా దానిని బాలీవుడ్ సినిమా అంటేనే చాలా మంది ఒప్పుకోలేదు ఇప్పుడు మళ్ళీ తమిళ సినిమా అంటూ కామెంట్ చేయడం ఏంటి అని అనేక మంది అంటున్నారు. దీనితో ఈ స్టేట్మెంట్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు