‘చుట్టమల్లె’కి నాని హీరోయిన్ ఫిదా.. ఇలా కూడా వాడొచ్చా..?

‘చుట్టమల్లె’కి నాని హీరోయిన్ ఫిదా.. ఇలా కూడా వాడొచ్చా..?

Published on Aug 27, 2024 3:24 PM IST


ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసినా అందులో ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లె’ సాంగ్‌కి సంబంధించిన రీల్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇంతలా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ సాంగ్‌కి కామన్ ఆడియెన్స్‌తో పాటు సెలెబ్రిటీలు సైతం రీల్స్ చేస్తూ కనిపిస్తున్నారు. జూ.ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ల రొమాంటిక్ మెలోడీ సాంగ్ సెన్సేషనల్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది.

అయితే, అందరూ డ్యాన్స్ చేస్తూ ఈ సాంగ్‌ను రీల్స్ చేస్తుంటే, న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ హీరోయిన్ ప్రియాంక మోహన్ మాత్రం కాస్త వైవిధ్యంగా ఈ పాటను వాడుకుంది. ‘సరిపోదా శనివారం’ చిత్రం ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతుండటంతో ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో పలు నగరాల్లో చిత్ర యూనిట్ పర్యటించి సినిమాను ప్రమోట్ చేశారు.

ఈ క్రమంలో గత వారం రోజులుగా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొంటున్న ప్రియాంక తన పర్యటనకు సంబంధించి ఓ రీల్ చేసింది. దీనికి ‘దేవర’ మూవీలోని ‘చుట్టమల్లె’ సాంగ్ ఆడియోను జోడించింది. దీంతో ఈ సాంగ్‌ని ఇలా కూడా వాడి రీల్స్ చేయొచ్చా అని అభిమానులు సర్‌ప్రైజ్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు