రిస్క్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్..?

రిస్క్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్..?

Published on Sep 22, 2024 3:02 AM IST


టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూర్తి ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా విషయంలో ఆయన ఓ పెద్ద రిస్క్ చేయబోతున్నారనే టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్న సంస్థలు, ఆయన ఈ సినిమాను వేసవికి రిలీజ్ చేయాలని కోరుతున్నాయట. అయితే, ఆయన మాత్రం సంక్రాంతికే రిలీజ్ ఉంటుందని తేల్చి చెప్పారట. దీంతో ఈ చిత్రానికి సంబంధించి ఇంకా ఎలాంటి డిజిటల్ రైట్స్ డీల్ కాలేదని తెలుస్తోంది.

ఈ సినిమాను రిలీజ్ చేసిన తరువాతే డిజిటల్ రైట్స్ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని ఆయన ఆలోచిస్తున్నారట. అయితే, ఇది రిస్క్ ఫ్యాక్టర్ అని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి నిజంగానే ఈ సినిమా విషయంలో దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా.. లేక ఇదంతా కేవలం పుకార్లేనా అనేది తెలియాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు