రాయన్: ధనుష్ కి 2 చెక్ లను అందజేసిన ప్రొడ్యూసర్ కళానిధి మారన్!

రాయన్: ధనుష్ కి 2 చెక్ లను అందజేసిన ప్రొడ్యూసర్ కళానిధి మారన్!

Published on Aug 23, 2024 12:00 AM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ ఇటీవల రాయన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం కూడా వహించాడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన రెహమాన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం సక్సెస్ సాధించడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

అయితే ప్రొడ్యూసర్ కళానిధి మారన్, ధనుష్ కి అభినందనలు తెలుపుతూ, రెండు చెక్ లను అందజేశాడు. ఒక చెక్ హీరోగా నటించినందుకు, మరొకటి దర్శకత్వం వహించినందుకు. ప్రొడ్యూసర్ చెక్ లను ధనుష్ కు అందజేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రంలో సెల్వ రాఘవన్, జయరామ్, కాళిదాస్, సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, ఎస్.జే. సూర్య, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మి శరత్ కుమార్, దుషార విజయన్ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు