నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా
రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దర్శకుడు బాబీ, చిరంజీవి సినిమా కంటే బాలయ్య సినిమాని బాగా తీశాడు అని, సినిమా అదిరిపోయిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ‘చిరు ఫాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు. చిరంజీవి గారి సినిమా కంటే బాలకృష్ణ మూవీ బాగా తీశారు డైరెక్టర్’ అని నాగవంశీ చెప్పడం విశేషం.
అలాగే, టాలీవుడ్ ఏపీకి వెళ్తుందనే ప్రచారం అవాస్తవమని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. ఇక “డాకు మహారాజ్” సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కాగా ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ మరియు ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.