హీరో సూర్య తలకి గాయం… ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న పాండ్యన్!

కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరో సూర్య. తదుపరి శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంగువా చిత్రంలో కనిపించనున్నాడు. అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అయితే హీరో సూర్య ప్రస్తుతం సూర్య 44 చిత్రంలో నటిస్తున్నారు.

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. హీరో సూర్య తలకి గాయం కావడంతో షూటింగ్ ను తాత్కాలికంగా ఆపివేశారు. అయితే అది స్వల్ప గాయం అని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ తెలిపారు. ఈ వార్తతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హీరో సూర్య తన సినిమాలకు ఎలాంటి గ్యాప్ లేకుండా అభిమానులని అలరించడానికి హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇటీవల సూర్య 44 నుండి రిలీజైన గ్లింప్స్ కి నేషనల్ వైడ్ గా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Exit mobile version