పవన్ కళ్యాణ్ స్టేచర్ వేరు – ప్రొడ్యూసర్ రవి శంకర్

పవన్ కళ్యాణ్ స్టేచర్ వేరు – ప్రొడ్యూసర్ రవి శంకర్

Published on Aug 30, 2024 9:35 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల స్మగ్లింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పరోక్షంగా ఈ వ్యాఖ్యలు బన్నీ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ పై చేశారు అని కొంతమంది ఘాటు విమర్శలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పట్ల నిర్మాత రవి శంకర్ ను ఒక విలేఖరి అడగగా, అందుకు సమాధానం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడారు కానీ, మనం అనవసరం గా దీనికి దానికి అని అప్లై చేసుకుంటున్నాం. ఆయన స్టేచర్ వేరు. ఆయన వచ్చిందే సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి, అలా తక్కువ చేయాలని అనుకోరు. ఫ్లొ లో అలా వచ్చింది కానీ, మనం అలా అప్లై చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు