RC16 టీజర్‌లో స్పెషల్ షాట్.. అదిరిపోయిందట!

RC16 టీజర్‌లో స్పెషల్ షాట్.. అదిరిపోయిందట!

Published on Mar 26, 2025 11:30 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం RC16 నుంచి బిగ్ ట్రీట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి నిర్మాత రవిశంకర్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తాజాగా పంచుకున్నారు.

RC16 చిత్ర టీజర్‌ను తాను చూశానని.. ఇది ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని ఆయన అన్నారు. ఇక ఈ టీజర్‌లో ఓ పర్టికులర్ షాట్‌ను అభిమానులు పదేపదే చూస్తారని.. అది లెంగ్తీ షాట్ అయినప్పటికీ అంతలా ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు.

ఇక ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడం ఖాయమని ఆయన తెలిపారు. రవి శంకర్ చేసిన కామెంట్స్‌తో RC16 మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాలో జన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు