టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ 12వ చిత్రానికి సంబంధించిన అద్భుతమైన కాన్సెప్ట్ పోస్టర్ని నిన్న అతని పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. ఆసక్తికరమైన పోస్టర్లో విజయ్ ముఖాన్ని పేపర్ ముక్కలు ముక్కలుగా చేశారు. ఈ పోస్టర్ బెన్ అఫ్లెక్ యొక్క ఆర్గో మరియు మరికొన్ని సినిమాలతో పోలికలను కలిగి ఉంది. VD12 మేకర్స్ పోస్టర్ను కాపీ చేశారని, నెటిజన్లలో ఒక వర్గం ఆరోపించింది. ఈరోజు మధ్యాహ్నం చిత్ర నిర్మాత నాగ వంశీ ఆ ఆరోపణలపై తనదైన శైలిలో స్పందించారు.
అతను ట్విట్టర్ ద్వారా, సత్యజిత్ రే యొక్క అగంతుక్, కైతి, ది బోర్న్ లెగసీ మరియు VD12 యొక్క కొన్ని పోస్టర్లను షేర్ చేశాడు. సందర్భాన్ని అర్థం చేసుకోవడం మంచిది అని అన్నారు. దయచేసి సరైన ఆధారం లేకుండా తీర్పు చెప్పే ప్రలోభాలకు దూరంగా ఉండండి అని నాగ వంశీ ట్వీట్ చేశారు. నాగ వంశీ చేసిన ట్వీట్ కి నెటిజన్స్ రెస్పాన్స్ అవుతున్నారు. అసలు సినిమా ఏదైనా సినిమా నుండి ప్రేరణ పొందిందా లేదా అనేది చూడాలి. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో విజయ్ పోలీసుగా నటిస్తున్నాడు. హ్యాపెనింగ్ యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.
Before jumping on to the bandwagon of tags, it's better to understand the context. Shredding or stripping identities concept is as old as the secret agencies. Kindly, refrain from temptations of passing judgement without proper basis. #VD12 pic.twitter.com/yHp7ZlPbGo
— Naga Vamsi (@vamsi84) May 10, 2023