పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, అటు సినిమాల్లో కూడా పవన్ బిజీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కొత్త సినిమా అప్ డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ ఓ మూవీ చేయనున్నారు. ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాని ఘనంగా నిర్మించనున్నారు.
తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా ఈ మూవీ గురించి నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ, దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు మా టీమ్ అంతా ఈ మూవీ కోసం రెడీగా ఉన్నాం. అయితే, పవన్ గారి నుంచి గ్రీన్ సిగ్నల్ తో పాటు ఆయన కాల్షీట్స్ లభించాల్సి ఉంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
మొత్తానికి ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట. ఇక ప్రస్తుతం పవన్ పిఠాపురం ఎమ్మెల్యే గా, ఆంధ్ర డిప్యూటీ సీఎంగా తన సేవలు అందిస్తున్నారు.