ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నటించే సినిమాలకు మాస్, క్లాస్ అంటూ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇక ‘పుష్ప’ సినిమాతో బన్నీ ఇమేజ్ అమాంతం అలా పెరిగిపోయింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అయితే, ప్రస్తుతం బన్నీపై కొందరు కావాలనే టార్గెట్ చేస్తూ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ప్రముఖ నిర్మాత ఎస్కెఎన్ అన్నారు. తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్లో ఆయన అల్లు అర్జున్‌పై కొన్ని కామెంట్స్ చేశారు. పుష్ప సినిమా కోవిడ్ కారణంగా 50 శాతం అక్యుపెన్సీ ఉన్న సమయంలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా నార్త్ ఇండియాలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు అక్కడ ఎలాంటి రీచ్ వచ్చిందంటే.. కలకత్తాలోని ఓ మావోయిస్ట్ ప్రాంతంలో సినిమాలు వేయడమే కష్టం.. కానీ, అక్కడ ‘పుష్ప’ మూవీ ఏకంగా 50 రోజులు రన్ అయ్యింది. ఇది అల్లు అర్జున్, పుష్ప కి ఉన్న రీచ్ అని ఆయన అన్నారు.
తెలుగు సినిమా చరిత్రలో 70 ఏళ్లుగా ఎవరూ సాధించలేని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కేవలం అల్లు అర్జున్ మాత్రమే సాధించడం ఆయన సత్తాను తెలుపుతుందని ఎస్కెఎన్ అన్నారు. ఇలా బన్నీ గురించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ను ఎస్కెఎన్ ఎలివేట్ చేసిన విధానంపై బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.