విషాదం : సీనియర్ తెలుగు నిర్మాత మృతి

విషాదం : సీనియర్ తెలుగు నిర్మాత మృతి

Published on Jul 29, 2024 10:35 AM IST

తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీ నిర్మాత ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు గుండెపోటుతో చనిపోయారు. ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు గ‌తంలో పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ పై తెలుగు, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 24 సినిమాలు నిర్మించారు. వీటిలో మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడీ, సంధ్యా, బజారు రౌడి, అల్లుడు దిద్దిన కాపురం, శంఖారావం వంటి విజ‌య‌వంత‌మైన సినిమాలు కూడా ఉండటం విశేషం.

పైగా ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు సూప‌ర్‌స్టార్‌ కృష్ణ గారికి బావమరిది. కృష్ణా జిల్లా , పామర్రు మండలం రిమ్మనపూడి గ్రామంలో ఆయన పుట్టారు. సూపర్ స్టార్ కృష్ణ రెండవ సోదరి లక్ష్మీ తులసిని ఉప్పలపాటి గారు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 123తెలుగు.కామ్ తరఫున ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు