దర్శకుడిగా మారిన “యమ్ 6” నిర్మాత విశ్వనాథ్ తన్నీరు.

దర్శకుడిగా మారిన “యమ్ 6” నిర్మాత విశ్వనాథ్ తన్నీరు.

Published on Jan 29, 2020 12:09 PM IST

సినీ నిర్మాత విశ్వనాధ్ తన్నీరు ఇటీవల “యమ్ 6″ అనే సస్పెన్స్ థ్రిల్లర్ నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు, ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా విశ్వనాధ్ తన్నీరు తన క్రొత్త ప్రాజెక్ట్ విశేషాలను తెలియజేసారు . ఆయన మాట్లాడుతూ…”సినిమా మీద ప్యాషన్ తో ఈరంగం లోకి వచ్చిన నేను “యమ్ 6” సినిమా తో నిర్మాతగా మారా . ఐతే నాకు దర్శకుడు కావాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది . ఈ క్రమంలో ఎన్నో కథలు విన్నా . చివరకు ఓ అద్భుతమయిన కథ దొరికింది . కంటెంట్ ఆధారం గా నిర్మితమవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది . అలాగే ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాం . ముఖ్యంగా ఈ చిత్రం లోని క్లైమాక్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది . ఈ సినిమా లో హీరోగా మా గత చిత్రం “యమ్ 6 “లో హీరో గా చేసిన ధ్రువ ను ఎంపిక చేసాం. తనలో మంచి టాలెంట్ ఉంది . ఈ క్యారెక్టర్ కి తను బాగా మ్యాచ్ అవుతాడు . ఈ సినిమా ఫిబ్రవరి నెల మొదటి వారం హైదరాబాద్, రెండో షెడ్యూల్ వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కంప్లీట్ చేస్తాము. ఇలా 4 షెడ్యూల్స్ లో సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం” అన్నారు .

హీరో ధ్రువ మాట్లాడుతూ…”యమ్ 6″ సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేసిన విశ్వనాధ్ గారికి ధన్యవాదాలు. ఆయన దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఇది, నాకు రెండో సారి ఈ వినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో నేను మరింత పేరు తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతాను. ఫిబ్రవరి మొదటివారంలో షూటింగ్ కు వెళ్లి కంటిన్యూటి షెడ్యూల్ లో షూట్ కంప్లీట్ చెయ్యబోతున్నాము అన్నారు.

హీరో ధ్రువ, రాగిణి, డి.యస్ .రావు , గురురాజ్ , నామాల రవీంద్ర సూరి , మాస్టర్ జైనీత్ , దిల్ రమేష్ ,శివమ్ శివరాత్రి, గిరి , తిలక్ , నర్సిరెడ్డి , చంటి , సందీప్ , కుమరం తదితరులు నటిస్తున్నారు.

కథ , మాటలు:వేమగిరి , మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ కూరాకుల
పాటలు :మౌనశ్రి మాలిక్
ఎడిటింగ్ : సోమేశ్వర్ పోచం
పిఆర్ఓ: మధు. విఆర్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ : గుర్రపు విజయ్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం: నిర్మాత : విశ్వనాధ్ తన్నీరు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు