కమల్ మూవీలో ఒక ఫైట్ కోసం 40కోట్లట….!

కమల్ మూవీలో ఒక ఫైట్ కోసం 40కోట్లట….!

Published on Oct 18, 2019 11:00 AM IST

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో కమల్ కి జంటగా కాజల్ నటిస్తున్నారు. ఇటీవలే రాజమండ్రి పరిసర ప్రాంతాలలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. మొదటి పార్ట్ లో లానే ఈ చిత్రంలో కూడా కమల్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వీటిలో ఒకటి 90 ఏళ్ల వృద్దిడి పాత్ర అని సమాచారం. ఐతే ఈ చిత్రం కొరకు ఏకంగా 40కోట్ల బడ్జెట్ తో ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట. భోపాల్ లో జరుగుతున్న ఈ యాక్షన్ సన్నివేశాన్ని పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో హీరో కమల్ పై తెరకెక్కిస్తున్నారని సమాచారం. కాగా ఈ షెడ్యూల్ అనంతరం తైవాన్ మరియు యూరప్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘భారతీయుడు 2’ పేరుతో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు