వి ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం.!

Published on Sep 24, 2020 2:17 pm IST

వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ మరియు రీతూ రెడ్డి హీరో హీరోయిన్లుగా వరుణ్.కె దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం పూజా కార్యక్రమాలతో లేటెస్ట్ గా ప్రారంభం అయ్యింది. 1998 బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమకథగా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల చివారివారంలో స్టార్ట్ కాబోతోంది.

పల్లెటూర్లలో ఉండే పగ ప్రతీకరాలతో ఈ చిత్ర కథాంశం ఉందనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు వరుణ్.కె గతంలో జ్యోతి లక్ష్మి, సఖియా, చిన్నదాన, మరోచిత్రం, మరువలేను వంటి అద్భుతమైన లఘు చిత్రాలను తీశారు. యూట్యూబ్ లో ఈ షార్ట్ ఫిలింస్ ప్రేక్షకాదరణ పొందాయి.

ఆ అనుభవంతో వరుణ్.కె మొదటిసారి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో రోహిత్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అంతా కొత్తవారితో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతొంది. త్వరలో ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే
సంగీతం: రోహిత్, సాహిత్యం : తిరుపతి జావన్న, కెమెరామెన్: సురేష్ & బాబులు అందిస్తుండగా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: వరుణ్.కె అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More