పొన్నియిన్ సెల్వన్: వైరల్ అవుతోన్న ఐశ్వర్య రాయ్ – త్రిషల సెల్ఫీ!

Published on Sep 22, 2022 9:04 pm IST


అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. త్రిష, ఐశ్వర్యరాయ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 30 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌ లో త్రిష మరింత దూకుడు గా వ్యవహరిస్తోంది. మరియు ఐశ్వర్య రాయ్ ఇంకా ప్రమోషన్స్ లో చేరలేదు.

ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్స్ నుండి ఓ క్రేజీ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో త్రిషతో ఐశ్వర్యరాయ్ సెల్ఫీ దిగుతున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరు కథానాయికలు సినిమాలో భారీ ట్విస్ట్ లు కలిగి ఉన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. అదే, ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు అందాలను చూడటం గొప్ప దృశ్యం అని చెప్పాలి. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :