హెవీ వర్క్ అవుట్ వీడియోతో వచ్చిన స్టార్ హీరో

Published on Jun 4, 2020 1:04 am IST


కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మార్నింగ్ ఎక్స్ టెన్సివ్ వర్క్ అవుట్ వీడియో సోషల్ మీడియాలో పంచుకున్నారు. 45ఏళ్ళ ఈ యాక్షన్ అండ్ మాస్ హీరో ఎనర్జీ చూస్తే మెచ్చుకోకుండా ఉండలేం. ఆయన యంగ్ ఫెల్లో లా వెరీ హార్డ్ వర్క్ ఔట్స్ తో యూత్ కి మంచి మెస్సేజ్ ఇస్తున్నారు. ఇక ఈ జెనరేషన్ లో ఏజ్ ఎంతైనా హీరో అంటే పర్ఫెక్ట్ బాడీ ఉండాల్సిందే. లేదంటే సోషల్ మీడియా వేదికగా యాంటీ ఫ్యాన్స్ ఆటాడేసుకుంటారు.

కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పునీత్ తండ్రికి తగ్గట్టుగా మంచి మాస్ ఫాలోయింగ్ సాధించాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న యువరత్న, జేమ్స్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More