ఐపీఎల్ 2025లో భాగంగా నేడు జరిగిన లోక్నో సూపర్ జియెంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జియెంట్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేశారు.
ఇక 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 16.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69), శ్రేయాస్ ఐయర్ (52) పరుగులు చేసి జట్టుకి విక్టరీని అందించారు. దీంతో లక్నోపై పంజాబ్ విక్టరీ సాధించి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి ఎగబాకింది.