బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రం ‘సికందర్’ డిజప్పాయింట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత సల్మాన్ వెనక్కి తగ్గకుండా మంచి ఎనర్జిటిక్ గా తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక మరో పక్క ఐపీఎల్ మ్యాచ్ లు మంచి రసవత్తరంగా జరుగుతుండగా సల్మాన్ పాత ట్వీట్ ఒకదానికి ఇపుడు పంజాబ్ కింగ్స్ సెటైరికల్ రిప్లై ఇవ్వడం జరిగింది.
అయితే పంజాబ్ జట్టుని ఎప్పుడు నుంచో బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటానే కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఎపుడో 2014లో ఆమె జట్టుపై సల్మాన్ ఓ పోస్ట్ చేసాడు. జింటా టీం గెలిచిందా? అనే పాత పోస్ట్ కి నిన్న పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ గెలవడంపై రిప్లై ఇచ్చారు. అది కూడా సల్మాన్ ఖాన్ ఫన్ గిఫ్ తోనే రిప్లై ఇవ్వడం మంచి ఫన్ గా మారింది. దీనితో తన పోస్ట్ కి మరిన్ని రిప్లైలు వస్తున్నాయి. అయితే నిన్న మ్యాచ్ లో మాత్రం పంజాబ్ కింగ్స్ అంత తక్కువ స్కోర్ ని కూడా డిఫెండ్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
???????? https://t.co/Aa13UluIeU pic.twitter.com/v0mzqxFiY9
— Punjab Kings (@PunjabKingsIPL) April 15, 2025