ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన CSK vs PBKS మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన్ ప్రియాంశ్ ఆర్య(103) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్ జట్టుకు ఒంటిచేత్తో స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఆయనకు తోడుగా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఇక చివర్లో శశాంక్ సింగ్(52 నాటౌట్), మార్కో జన్సెన్ (34 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పంజాబ్ 219 పరుగులు చేసింది.
ఇక 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రచిన్ రవీంద్ర(36), డివోన్ కాన్వే(69) జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబె(42), ఎంఎస్ ధోని(27) స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా ఓటమి అనివార్యం అయ్యింది. దీంతో 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. దీంతో చెన్నైపై పంజాబ్ 18 పరుగులతో విజయం సాధించింది.