భక్తుల గుండెలకు పొదువుకుంటున్న పురాణపండ ” శ్రీమాలిక ” వైకుంఠం కటాక్షమే !

Puranapanda Srinivas

విశాఖపట్నం : జనవరి : 1

వైకుంఠ వాకిళ్ళ వరాల పోతగా ఒక మనోహరమైన మంత్రపూత మంగళ గ్రంధం ‘ శ్రీమాలిక ‘ గా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినవేళ తిరుమల మహాక్షేత్రం , సింహాచల క్షేత్రం, విశాఖపట్నంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి దేవాలయం , హైదరాబాద్ హిమాయత్ నగర్, జూబిలీ హిల్స్ లోని తిరుమల తిరుపతి దేవస్థానాల శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయాలు, విజయవాడ లబ్బీపేట వేంకటేశ్వర స్వామి వారి మహా దేవాలయం, ఉభయగోదావరి జిల్లాలలోని పలు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయాల్లో వేలాదిమందిని ఆకట్టుకుని … ప్రముఖ రచయిత , జ్ఞానమహాయజ్ఞకేంద్రం సంస్థాపక కార్యదర్శి పురాణపండ శ్రీనివాస్ ప్రతిభ, ధార్మిక చైతన్యసేవ పై అభినందనల జల్లుల్ని వర్షింపచేసింది.

వైకుంఠ ఏకాదశికి ముందురోజైన ఆదివారం క్రొత్త సంవత్సరం సందర్భంగా ఆలయాలకు విచ్చేసిన వందలకొలది భక్త బృందాలకు ఆయా ఆలయాల ప్రతినిధులు అందజేసిన రెండువందల ఎనభైపేజీల ‘ శ్రీమాలిక ‘ ఒక శుభదృష్టిగా అందడం విశేషమని భక్తులు తన్మయత్వంతో జేజేలు పలికారు. ముందురోజునే ఈ శ్రీతత్వపు సందడి మొదలవ్వడం ప్రత్యేక విశేషంగానే పేర్కొనాలి.

భక్తుల గుండెలకు పొదువుకుని చదువుకునేలా పురాణపండ శ్రీనివాస్ ఈ పరమతత్వాల రమణీయ పవిత్ర చైతన్యాన్ని పరమాద్భుతంగా రూపుదిద్దారని ఎంతోమంది ప్రశంసలు వర్షించడం ప్రత్యక్షంగా కనిపిస్తున్న ప్రస్ఫుట సత్యం. ప్రతీ పేజీ ఎంతో మహిమామయ వైభవంగా … ఆకర్షణీయ సౌందర్యంతో ఈ శ్రీమాలిక తిరుమల శ్రీవారి ముఖపత్ర సౌందర్యంతో ప్రశాంత నిర్మలత్వాన్ని ఆవిష్కరిస్తోందని పలుదేవాలయాల అధికారులు, అర్చక పండిత శ్రేష్ఠులు పేర్కొనడం పురాణపండ శ్రీనివాస్ సంకలన ఉదాత్తతను, రచనా శోభను , గ్రంథ మహత్తును తెలియపరుస్తోందనడం నిర్వివాదాంశం.

లోకోత్తరమైన ఆధ్యాత్మిక సాధనలవల్లనే పురాణపండ శ్రీనివాస్ ఇంతటి మహోజ్వల కార్యాన్ని నిస్వార్ధంగా చెయ్యగలుగుతున్నారని , భక్తుని మనస్సు ఆనంద తాండవమాడేలా ఈ మహోత్తమ గ్రంధాన్ని అందించిన శ్రీనివాస్ కు వైకుంఠనాధుని కారుణ్యం ఉందనడానికి ఈ మంత్రక్షేత్రం ప్రత్యక్ష నిదర్శనమని, ఇది మామూలు విషయం కాదని తిరుమల ప్రధానార్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, యాదాద్రి ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు బాహాటంగానే చెప్పారు కూడా. కల్పవృక్షాల్లాంటి మంత్రపేటికలు తెలుగు రాష్ట్రాల్లో ఇంత సాహసంగా , ఇంత అద్భుతంగా , ఇంత తేజోవంతంగా, ఇంత ప్రజ్ఞతో అందించడం పురాణపండ శ్రీనివాస్ కి మాత్రమే చెల్లిందని గతంలో భారత పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వంటి ప్రముఖులు కితాబు ఇచ్చిన విషయం లక్షల భక్త పాఠకులకు తెలిసిందే.

ఎందరో పారిశ్రామిక వేత్తలు, ఉభయ రాష్ట్రాలకు చెందిన కొందరు మంత్రులే కాకుండా చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, దిల్ రాజు, చలసాని అశ్వనిదత్, సాయి కొర్రపాటి , మంత్రి రోజా వంటి సినీ ప్రముఖులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా శ్రీనివాస్ పవిత్ర గ్రంధాలకు సమర్పకులుగా ఉండటం విశేషం. శ్రీనివాస్ చేస్తున్న కృషి మామూలు విషయం కాదని ఇటీవల సాక్షాత్తూ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విజయంద్రసరస్వతి బహిరంగంగా మంగళా శాసనాలు చెయ్యడం ఒక మైలురాయిగా చెప్పాల్సిందే మరి !

Exit mobile version