పురాణపండ శ్రీనివాస్ చెప్పగానే అమృతేశ్వరుణ్ణి చూసి పరవశించిపోయానన్న సుమ కనకాల

పురాణపండ శ్రీనివాస్ చెప్పగానే అమృతేశ్వరుణ్ణి చూసి పరవశించిపోయానన్న సుమ కనకాల

Published on Mar 7, 2025 9:50 PM IST

Sri Amrutheshwara Temple in Ballari

బళ్ళారి : మార్చి : 7

కర్ణాటక రాష్ట్ర చరిత్రలో ఒక మహోజ్వలఘట్టానికి ‘ఈగ ‘ చలన చిత్ర నిర్మాత , వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి తెరతీశారు. సుమారు ఇరవై ఐదు కోట్ల వ్యయంతో అరుదైన కృష్ణ శిలలతో ‘ శ్రీ అమృతేశ్వర ఆలయం ‘ పేరిట ఒక మహాద్భుత పవిత్ర కార్యానికి బళ్లారి నగరం లో శ్రీకారం చుట్టి … తరువాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, శ్రీమతి రమా రాజమౌళి దంపతుల , కె.జి .ఎఫ్ హీరో యష్ , ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ , ప్రముఖ జానపద గాయని మంగ్లీలు ముఖ్య అతిధులుగా పాల్గొన్న మంగళ ముహూర్తంలో శ్రీ అమృతేశ్వర ఆలయాన్ని ప్రారంభించిన ఘటన తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖుల్లో సంచలనం సృష్టించిందని చెప్పాలి.

puranapanda srinivas with suma

ఈ మహా శివరాత్రికి శ్రీ అమృతేశ్వర ఆలయంలో అపూర్వంగా జరిగిన అభిషేక , అర్చన వంటి రుద్ర మంగళ కార్యాలలో ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల పాల్గొనడంతో ఆలయానికి విచ్చేసిన వేలకొలది భక్తులు టాక్ ఆఫ్ బళ్లారి గా చెయ్యడంతో అమృతేశ్వరున్ని దర్శించిన అనంతరం సుమను చూసేందుకు ఎగబడ్డారు.

ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ శ్రీ అమృతేశ్వర ఆలయ ఫౌండర్ చైర్మన్ సాయి కొర్రపాటికి అత్యంత సన్నిహితులైన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ ఆలయ వైభవం గురించి తనకి చెప్పడంతో తాను, తన బృందంతో ఈ అమృతేశ్వరుణ్ణి దర్శించడానికి వచ్చానని, ఈ మహా శివరాత్రి మహా పర్వదినం తనకి అద్భుత అనుభూతిని, ఎంతో పారవశ్యాన్ని ఈ ఆలయం అందించిందని చెప్పడం విశేషం.
ఈ సందర్భంగా కొర్రపాటికి , పురాణపండకి సుమ కనకాల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

sai korrapati suma

ప్రభాత వేళ నుండి అర్ధరాత్రి లింగోద్భవ వేళ వరకూ ఈ ఆలయంలో జరిగిన ప్రతీ పవిత్ర కార్యాన్ని సాయి కొర్రపాటి, శ్రీమతి రజని కొర్రపాటి పవిత్రంగా పర్యవేక్షించి లక్షకి పైగా వచ్చిన భక్త కోటి ప్రశంసలకు పాత్రులయ్యారు.

శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రేనివాస్ తో సాయి కొర్రపాటికి ఉన్న గాఢమైన స్నేహత్వంలో సాయి కొర్రపాటి కి ఈ అమృతేశ్వర ఆలయ నిర్మాణానికి స్ఫూర్తి కలిగించిందని హైదరాబాద్ ఫిలిం నగర్ టాక్.

bollineni krshnaiah with suma

మహా శివరాత్రికి ఈ ఆలయంలో జరిగిన ఉత్సవ సంరంభంలో బళ్ళారి సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ శోభారాణి, హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య , మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు , హైదరాబాద్ , బెంగళూరు , బళ్లారి కి చెందిన పలువురు సినీ రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు ప్రముఖులు పాల్గొన్నారు. శంకర పీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ పర్యవేక్షణలో లింగోద్భవ కాలంలో శ్రీ అమృతేశ్వర మహా స్ఫటికలింగానికి వివిధ వైదిక ఉపచారాలతో జరిగిన అభిషేకార్చనలు చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.

Anchor Suma

సంబంధిత సమాచారం

తాజా వార్తలు