‘రైటింగ్’ పై పూరి ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

‘రైటింగ్’ పై పూరి ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

Published on Nov 21, 2020 7:14 PM IST

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తన పూరీ మ్యూజింగ్స్‌ భాగంగా ఈ రోజు ‘రైటింగ్’ అనే అంశం గురించి చెప్పుకొచ్చాడు. పూరి మాటల్లో.. ‘లాక్ డౌన్ టైమ్ లో సినీ ప్రేక్షకులు మారిపోయారని.. ఇకపై ఏది రాసినా గ్లోబల్ ను దృష్టిలో పెట్టుకొని రాయమని కొత్త రైటర్స్ కు పూరి కొని సలహాలు ఇచ్చాడు. ప్రపంచం మొత్తం నా సినిమా చూస్తోంది అనుకొని సినిమా తీయాలి. అలాగే మాస్ సినిమా తీసినా, కోటి రూపాయలతో చిన్న సినిమా తీసినా గ్లోబల్ మొత్తం నా సినిమా చూస్తుందనే స్పృహ రచయితకి దర్శకుడికి ఉండాలి.

కథ చెప్పాల్సిన నటులు, ప్రొడ్యూసర్లు రోజూ హాలీవుడ్ కంటెంట్ చూస్తున్నారు. పబ్లిక్ కూడా అంతే. కథలు రాసేవాళ్లు కూడా ఆ రేంజ్ లో ఉండాలి. లేకపోతే మనం అవుట్ డేటెడ్ అయిపోతాం. అదే కంటెంట్ బాగుంటే.. సబ్ టైటిల్స్ లేకపోయినా కొరియన్ సినిమా చూస్తున్నారు. నిజం మాట్లాడుకుంటే సి-సెంటర్ జనాలు కూడా చైనా సినిమాలు చూస్తున్నారు. మనమే బి-సెంటర్, సి-సెంటర్ కథలంటూ ఆలోచిస్తున్నాం. ఇకనైనా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే వేల కోట్లు ఖర్చుపెట్టడానికి ఎన్నో ఓటీటీలు రెడీగా ఉన్నాయి. దయచేసి సంవత్సరాల తరబడి స్క్రిప్టులు రాయొద్దు అంటూ పూరి కొత్త వాళ్లకు విలువైన సలహాలు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు