మెగాస్టార్ మూవీతో ఆ డైరెక్టర్ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా..?

మెగాస్టార్ మూవీతో ఆ డైరెక్టర్ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా..?

Published on Dec 27, 2024 3:01 AM IST

టాలీవుడ్‌లో డ్యాషింగ్ డైరెక్టర్‌గా పూరీ జగన్నాధ్ తనదైన మార్క్ వేసుకున్నాడు. ఒకటైమ్‌లో పూరి సినిమాలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. పూరీ సినిమాలు వస్తున్నాయంటే, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. అయితే, గతకొంత కాలంగా పూరీ తెరకెక్కించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్స్‌గా మిగులుతుండటంతో ఆయన నుంచి ఓ సాలిడ్ కమ్ బ్యాక్ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే, పూరీ గతంలో మెగాస్టార్ చిరంజీవి ల్యాండ్ మార్క్ మూవీ 150ని డైరెక్ట్ చేయాలని ప్రయత్నించాడు. దీని కోసం ‘ఆటో జానీ’ మూవీ కథను కూడా రెడీ చేశాడు. అయితే, చిరంజీవికి సెకండ్ హాఫ్ కథ నచ్చకపోవడంతో అందులో మార్పులు చేయాలని సూచించాడు. ఇక చిరు తన 150వ చిత్రాన్ని దర్శకుడు వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు పూరీ ‘ఆటో జానీ’ కథలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చిరు వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పూరీ కూడా ఎలాగైనా చిరంజీవితో ‘ఆటో జానీ’ మూవీని పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నాడట. చిరంజీవితో ‘ఆటో జానీ’ చిత్రాన్ని తెరకెక్కించి సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని పూరీ ఆలోచిస్తున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు