మహేష్ సినిమా పూజా కార్యక్రమానికి పూరి రాకపోవడానికి కారణం

Published on Nov 21, 2020 9:06 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగియగా త్వరలోనే మొదటి షెడ్యూల్ అమెరికాలో మొదలుకానుంది. ఈమేరకు వీసా ప్రాసెసింగ్ పనులు జరుగుతున్నాయి. పనులన్నీ ఓ కొలిక్కి రావడంతో సినిమా పూజా కార్యక్రమాలను ఈరోజు ఉదయం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు మహేష్ బాబు సతీమణి నమ్రత హాజరయ్యారు.

ఈ వేడుకకు పరశురామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను కూడ ఆహ్వానించారు. కానీ అదే సమయానికి పూరి తన కొత్త చిత్రం ‘ఫైటర్’ పనుల కోసం ముంబైలో ఉండటంతో పూజా కార్యక్రమాలకు హాజరుకాలేకపోయారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన పూరి పరశురామ్ కు అభినందనలు తెలిపి సినిమా మహేష్ బాబు అభిమానులకు ఒక పండుగల ఉంటుందని అంటూ మహేష్ బాబుతో పాటు చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. పూరి జగన్నాథ్ తనకు దగ్గరి బంధువు కావడం, కెరీర్ తొలినాళ్లలో ఒక గురువులా సహకారం అందించడంతో పరశురామ్ ఆయన్ను ఈ పూజా కార్యక్రమానికి ఆహ్వానించారు.

సంబంధిత సమాచారం :

More