అక్టోబర్ లో షూట్ కి ఫైటర్ రెడీనా ?

అక్టోబర్ లో షూట్ కి ఫైటర్ రెడీనా ?

Published on Aug 3, 2020 10:12 AM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ చేస్తోన్న ‘ఫైటర్’ సినిమా షూట్ రెడీ అవుతొందట. అక్టోబర్ 6న నుండి హీరోహీరోయిన్ల మీద సాంగ్స్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. కాగా లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడట. విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం బాగా కష్ట పడుతున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

ఇక ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది,. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. అన్నట్టు తరువాత షెడ్యూల్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌మ్య‌కృష్ణ‌, అన‌న్యా పాండే, రోణిత్ రాయ్‌, అలీ త‌దిత‌రుల‌ పై ముఖ్య‌మైన స‌న్నివేశాలను తీయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు