యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈరోజు తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒకరు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా పూరి జగన్నాథ్ ఎమోషనల్ నోట్ రాశారు.
నీ గుండెలో మంటను చూశాను. నీలోని మంచి నటుడిని చూశాను. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నీ ఆకలి, నీ పిచ్చి, నీ నిబద్ధత, నీ వినయం ఇవన్నీ నిన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్తాయి. ఏదో ఒక రోజు నువ్వు దేశానికి గర్వకారణం. విజయ్ దేవరకొండ, హ్యాపీ బర్త్‌డే అంటూ చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న లైగర్ షూటింగ్‌ను పూరి ఇప్పటికే పూర్తి చేశాడు. వీరిద్దరూ మళ్లీ జన గణ మన కోసం చేతులు కలిపారు, ఇది త్వరలో రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించనుంది.