ఆ హీరోతో పూరి కొత్త సినిమా ?

ఆ హీరోతో పూరి కొత్త సినిమా ?

Published on Sep 10, 2024 2:03 AM IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ కొత్త సినిమా పరిస్థితి ఏమిటి ? అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య బాలయ్య బాబు కోసం పూరి ఓ పవర్ ఫుల్ కథని రాశాడని, ఆ కథనే ఇప్పుడు బయటకు తీస్తున్నాడని.. బాలయ్యతో పూరి సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.

ఐతే, పూరి కొత్త సినిమా పై కొత్తగా మరో అప్ డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ హీరో గోపీచంద్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని, పూరి – గోపీచంద్ కాంబినేషన్ లో సినిమా వస్తోంది అంటూ తాజాగా ప్రచారం జరుగుతుంది. గతంలో వీరి కలయికలో గోలీమార్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగానే ఉంటుంది. మరి గోపీచంద్ – పూరి కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం గోపీచంద్ ‘విశ్వం’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు