‘లోఫర్’ ఎలా ఉంటుందో చెప్పిన పూరి

‘లోఫర్’ ఎలా ఉంటుందో చెప్పిన పూరి

Published on Dec 14, 2015 1:20 PM IST

puri
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన వరుణ్ తేజ్ తనకి కమర్షియల్ హీరో లేదా మాస్ హీరో అనే ఇమేజ్ రాకూడదు అనే ఉద్దేశంతో కెరీర్ ని డిఫరెంట్ సినిమాలైన ముకుంద, కంచె లాంటి సినిమాలు చేసి ఆడియన్స్ ని మెప్పించాడు. మూడవ సినిమాలో తనలోని మాస్ యాంగిల్ ని చూపడం కోసం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి ‘లోఫర్’ సినిమా చేసాడు. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్ర టీం జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

రీసెంట్ గా పూరి జగన్నాధ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూరి లోఫర్ సినిమా ఎలా ఉంటుందనేది చెప్పాడు. ‘లోఫర్ అనే కథ అమ్మ నాన్న ఓ కొడుకు.. ఈ మూడింటి చుట్టూ తిరుగుతుంది. తన కొడుకుని ప్రయోజకుడిని చేయాలనుకున్న తల్లి నుంచి కొడుకుని తీసుకెళ్ళి పక్కా లోఫర్ గా తయారు చేస్తాడు. తన మదర్ గురించి తెలుసుకున్న హీరో ఏం చేసాడు అన్నదే సినిమా కథని’ పూరి తెలిపాడు. దిశా పాట్ని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సికళ్యాణ్ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు