పూరి ‘ఫైటర్’ పూర్తిగా కొత్తవాడే

Published on Oct 20, 2020 3:00 am IST


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రం ‘ఫైటర్’. మొదటిసారి డాషింగ్ డైరెక్టర్, డాషింగ్ హీరో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ‘ఫైటర్’ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. పూరి సైతం ఖర్చుకు వెనుకాడకుండా గ్రాండ్ లెవల్లో సినిమాను రూపొందిస్తున్నారు. సినిమాలో విజయ్ కిక్ బాక్సర్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్రం గతంలో పూరి చేసిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’కి సీక్వెల్ అనే ప్రచారం మొదలైంది. ఆ చిత్రంలో హీరో తల్లి పాత్ర సినిమాకు ప్రధానం కాగా ‘ఫైటర్’లో కూడ హీరో మథర్ క్యారెక్టర్ కీలకంగా ఉండనుంది.

ఈ పాత్ర కోసం స్టార్ నటి రమ్యకృష్ణను భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చారు పూరి. దీంతో ఇది సీక్వెల్ అనే వార్తలు మరింత బలపడ్డాయి. కానీ చిత్ర బృందం సమచారం మేరకు ఇది సీక్వెల్ కాదని, పూర్తిగా కొత్త కథని, పూరి గత చిత్రాలకు దీనికి ఎలాంటి సంబంధం ఉండదని తెలుస్తోంది. సో.. పూరి తయారుచేస్తున్న ‘ఫైటర్’ పూర్తిగా కొత్తవాడే. ఇకపోతే ఈ చిత్రాన్ని ఛార్మీతో కలిసి పూరి నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ సైతం నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. త్వరలో షూటింగ్ థాయిలాండ్ లొకేషన్లో రీస్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :

More