‘పురుషోత్తముడు’ ఒక‌ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్!

‘పురుషోత్తముడు’ ఒక‌ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్!

Published on Jul 25, 2024 4:00 PM IST

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ న‌టిస్తున్న తాజా చిత్రం పురుషోత్తముడు రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇప్ప‌టికే ఈ చిత్ర పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్లు ఈ సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. హాసిని సుధీర్ హీరోయిన్ న‌టిస్తోన్న ఈ సినిమాను రామ్ భీమ‌న్ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూలై 26న ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మీడియాతో స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ భీమ‌న మాట్లాడుతూ.. నా తొలి రెండు సినిమాల త‌రువాత ఆరేళ్ల గ్యాప్ తో “పురుషోత్తముడు” మూవీ రూపొందించాను. డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ లాంటి మంచి ప్రొడ్యూసర్స్ నాకు దొరకడం సంతోషంగా ఉంది. వాళ్ళు సినిమా క్వాలిటీ కోసం చాలా ఆలోచించి మూవీ నిర్మించారు. “పురుషోత్తముడు” సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించాను. ఒక కోటీశ్వరుడైన అబ్బాయి పల్లెటూరికి ఎందుకు వచ్చాడు.. అక్కడ ఏం చేశాడు అనేది “పురుషోత్తముడు” కథ. ఇప్పటిదాకా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాని పాయింట్ ను టచ్ చేశాం. హీరో రాజ్ తరుణ్ తన పూర్తి సపోర్ట్ మూవీకి అందించారు. హీరోయిన్ హాసిని సుధీర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అని చెప్పుకొచ్చారు.

నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ.. ”నేను బిజినెస్ లో బాగా రాణిస్తున్నా ఒక మంచి తెలుగు సినిమా నిర్మించాలని కోరిక మనసులో ఉండేది. ఆ కోరిక “పురుషోత్తముడు” సినిమాతో తీరింది. సినిమా నిర్మించడం అంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా కథా కథనాలు, ఆర్టిస్టుల ఎంపిక, మంచి మ్యూజిక్, సాహిత్యం, టెక్నీషియన్స్ ను సెలెక్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ జాగ్రత్తగా, క్వాలిటీగా చేశాం. ఈ సినిమా సకుటుంబంగా ప్రేక్షకులంతా హాయిగా చూసేలా ఉంటుంది. ఇందులో ఎక్కడా వల్గారిటీ, చెడు అలవాట్లు చూపించడం వంటివి ఎక్కడా చేయలేదు. మా సంస్థలో ఇకపై వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాం.” అని తెలిపారు.

ఇక పురుషోత్త‌ముడు సినిమాలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ న‌టిస్తున్నారు. ఈ సినిమాకు గోపీ సుంద‌ర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు