సమీక్ష : పురుషోత్తముడు – కొన్ని చోట్ల మెప్పించే ఎమోషనల్ డ్రామా !

Purushothamudu Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 26, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రాజ్ త‌రుణ్, హాసిని సుధీర్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం తదితరులు.

దర్శకులు: రామ్ భీమ‌న

నిర్మాతలు : డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్.

సంగీత దర్శకుడు: గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రఫీ: పిజి విందా

ఎడిట‌ర్ : మార్తాండ కె వెంకటేష్.

సంబంధిత లింక్స్: ట్రైలర్

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ నటించిన తాజా చిత్రం పురుషోత్తముడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

రామ్ (రాజ్ త‌రుణ్) లండన్ లో చదువు ముగించుకుని ఇండియాకి వస్తాడు. అతని తండ్రి (మురళి శర్మ) తమ కంపెనీకి రామ్ ని సీఐవోగా చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అయితే, ఆ కంపెనీలో 50 షేర్ ఉన్న వసు (రమ్యకృష్ణ) ఒప్పుకోదు. కంపెనీకి రామ్ సీఐవో అవ్వాలంటే 100 రోజులు పాటు అజ్ఞాతంలో ఉండాలని, ఓ సామాన్యుడిలా బతకాలనే షరతు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తారు. ఆ షరతుకి రామ్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రామ్ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ?, రామ్ జీవితంలోకి అమ్ములు (హాసిని సుధీర్) ఎలా ఎంటర్ అయ్యింది ?, చివరకు తమ కంపెనీకి రామ్ సీఐవో అయ్యాడా? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఓ రిచ్ కిడ్ రియల్ లైఫ్ లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన రాజ్ తరుణ్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా రాజ్ తరుణ్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

హీరోయిన్ హాసిని సుధీర్ తన గ్లామర్ తో అలరించింది. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో కూడా ఆమె నటన బాగుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన రమ్యకృష్ణ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. మరో కీలక పాత్రలో మురళీశర్మ కూడా ఆకట్టుకున్నారు. క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగా నటించాడు. బ్రహ్మానందం మేనరిజమ్స్ బాగున్నాయి. ఆయన కామెడీ టైమింగ్ కూడా అలరిస్తోంది. అలాగే, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ పురుషోత్తముడు సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు రామ్ భీమ‌న కొన్ని చోట్ల తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్లే ఫుల్ ఫన్ తో సాగితే బాగుండేది. కానీ, ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ పెరగాలి కానీ, తగ్గకూడదు. కానీ ఈ పురుషోత్తముడు సినిమాలో సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదు.

హీరో రాజ్ తరుణ్ రైజ్ కోసం మెలో డ్రామా సీన్స్ ను పెట్టడం బాగాలేదు. అసలు ఈ డిజిటల్ వరల్డ్ లో పూలు పండించే రైతుల సమస్యలను మరీ ఇంత సినిమాటిక్ గా చూపించడం బాగాలేదు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు పేలవంగా సాగుతాయి. దీనికితోడు లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కు కూడా సరైన బలం లేదు. ఇక ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల ఫన్ బాగానే పేలింది. అయితే, ఆ ఫన్ ను కూడా దర్శకుడు సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోయాడు. దీంతో, సెకండ్ హాఫ్ బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది.

 

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా గోపీ సుంద‌ర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా పిజి విందా సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

పురుషోత్తముడు అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, మరియు కొన్ని కామెడీ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ పర్వాలేదు. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఐతే, రాజ్ తరుణ్ తో పాటు రమ్యకృష్ణ – ప్రకాష్ రాజ్ స్క్రీన్ అప్పియరెన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కానీ, ఓవరాల్ గా ఈ చిత్రం మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version