బస్సు ప్రమాదానికి గురి అయిన పుష్ప 2 ఆర్టిస్ట్స్!

Published on May 31, 2023 3:45 pm IST


రెండు రోజుల క్రితం, పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సెట్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది, అయితే అదృష్టవశాత్తూ, ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఇప్పుడు, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పుష్ప 2 ది రూల్ ఆర్టిస్టులు ఈ ఉదయం ప్రమాదానికి గురయ్యారు. నల్గొండలోని నార్కట్‌పల్లిలో పుష్ప 2 ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సును ప్రైవేట్ బస్సు ఢీకొన్నట్లు సమాచారం.

ఈ ప్రమాదం లో కొంతమంది తీవ్రంగా గాయపడగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, జగదీష్, ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :