‘పుష్ప 2’ 22 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

‘పుష్ప 2’ 22 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

Published on Dec 27, 2024 10:59 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు దాటినా, బాక్సాఫీస్ దగ్గర దూకుడు మాత్రం తగ్గించలేదు.

ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో ‘పుష్ప-2’ చిత్రానికి కళ్లుచెదిరే రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఈ సినిమా 22 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.1719 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. ఈ సినిమా కలెక్షన్లు టోటల్ రన్‌లో ఎంతవరకు వెళ్తాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు