హిందీలో “పుష్ప 2” తాండవం.. మరో కనీ వినీ ఎరుగని రికార్డు.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తే వాటిని రీచ్ అయ్యి రికార్డు వసూళ్లు నమోదు చేసింది. మెయిన్ గా నార్త్ ఇండియా మార్కెట్ లో హింది సినిమా కూడా చూడని రికార్డు వసూళ్లు చేసింది.

ఇలా బాలీవుడ్ లో మొట్టమొదటి 700 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్న సినిమా పుష్ప 2 చరిత్ర సృష్టిస్తే ఇపుడు దీని తర్వాత ఏకంగా 800 కోట్ల నెట్ మార్క్ ని అందుకొని ఇంకో నెవర్ బిఫోర్ రికార్డు హిందీ సినిమాలో సెట్ చేసింది. దీనితో పుష్ప 2 సినిమా హిందీలో ఎంత పెద్ద హిట్ అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version