ఇండియన్ సినిమా వద్ద “పుష్ప 2” హిస్టరీ.. అత్యధిక బుకింగ్స్ తో బిగ్ రికార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “పుష్ప 2”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం డే 1 నుంచే నెవర్ బిఫోర్ నంబర్స్ సెట్ చేసి అదరగొట్టింది. అయితే ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో సెట్ చేసిన వండర్స్ మరిన్ని ఉండగా ఇపుడు లేటెస్ట్ గా మరో ఊహించని ఫీట్ ని సెట్ చేసి చరిత్ర సృష్టించింది.

ప్రముఖ టికెట్ బుకింగ్స్ యాప్ లో పుష్ప 2 ఏకంగా 18 మిలియన్ కి పైగా బుకింగ్స్ ని నమోదు చేసి ఏ ఇండియన్ సినిమా కూడా కొట్టని బిగ్గెస్ట్ రికార్డు అందుకుంది. దీనితో పుష్ప 2 సినిమా ఒక సెన్సేషనల్ ఫీట్ ని నమోదు చేసింది అని చెప్పాలి. దీనికి ముందు హైయెస్ట్ బుకింగ్స్ లో కేజీయఫ్ చాప్టర్ 2 ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనిని బ్రేక్ చేసి పుష్ప 2 ఈ బిగ్ రికార్డు నమోదు చేసింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version