ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ నుంచి వచ్చిన రెండో పాన్ ఇండియా హిట్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ రాబడుతూ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు ఏకంగా 3 గంటల 20 నిమిషాల నిడివి అంటే కొంచెం టెన్షన్ పడ్డారు కానీ మేకర్స్ చెప్పినట్టుగానే అసలు నిడివి సమస్యే కాదు అని పుష్ప 2 ప్రూవ్ చేసింది.
అయితే ఈ నిడివి రీత్యా పాటల్లో మేకర్స్ కొన్ని బిట్స్ డిలీట్ చేసేసారు. అలా సినిమా టైటిల్ సాంగ్ “పుష్ప పుష్ప”లో కూడా ఓ చరణం దాని తాలూకా వీడియో విజువల్స్ ని కూడా తొలగించారు. అయితే ఇందులో ఒక పవర్ఫుల్ బిట్ ఇపుడు ఫ్యాన్స్ ని సహా మూవీ లవర్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. మరి ఈ వీడియో సాంగ్ లో పుష్ప రోల్ ని ఎలివేట్ చేస్తూ ఓ క్రికెట్ మ్యాచ్ సన్నివేశం పిల్లలతో కనిపిస్తుంది.
మరి వారికి పుష్ప బహుమతులు ఇవ్వడం కూడా చూపించారు. అయితే దీనికి మించి హైలైట్ ఏంటంటే ఆ పిల్లలు అందరు కలిసి పుష్ప 1 లో ఏయ్ బిడ్డ సాంగ్ గెటప్స్ లో గడ్డం పెట్టి మాస్ స్టెప్పులు వేయడం వారితో కలిసి అల్లు అర్జున్ కూడా కాలు కదపడం మాత్రం మంచి ఎగ్జైటింగ్ గా ఉందని చెప్పాలి. దీనితో సినిమాలో ఈ బిట్ కూడా ఉంచినా బాగుణ్ణు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఇలా ఈ సాంగ్ కి దేవిశ్రీ ప్రసాద్ సాలిడ్ బీట్స్ కి సుకుమార్ విజన్ అలాగే అల్లు అర్జున్ స్వాగ్ తో అదిరిపోయింది అని చెప్పొచ్చు.
పుష్ప పుష్ప సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి