నాలుగు వారాల్లో ‘పుష్ప 2’ కలెక్షన్స్ ఎంతంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గదే లే అంటూ దూసుకుపోతుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేయగా, ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడంతో దూసుకెళ్తుంది.

ఇక బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘పుష్ప 2’ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1799 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దుమ్ము లేపింది. ఈమేరకు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

‘పుష్ప 2’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version