ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ సీక్వెల్ సినిమా “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి. మరి ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న ఈ సినిమా మేనియా ఇప్పుడు మళ్ళీ మొదలైంది.
సౌత్ నుంచి నార్త్ వరకు కూడా ఇప్పుడు పుష్ప నామమే అంతా జపం చేస్తున్నారు. ఇక ఇండియాలో అయితే ఆల్రెడీ కన్నడ, మళయాళ హిందీ భాషల్లో పుష్ప 2 బిగ్గెస్ట్ రిలీజ్ ఉంటుంది అని మేకర్స్ కన్ఫామ్ చేశారు. అయితే లేటెస్ట్ గా వరల్డ్ వైడ్ గా కూడా పుష్ప 2 కి ఆల్ టైం హైయెస్ట్ రిలీజ్ ఉండబోతుంది అని తెలుస్తుంది.
ఇలా పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 11 వేల 500 స్క్రీన్స్ కి పైగా విడుదల కాబోతుంది అని తెలుస్తుంది. దీనితో ఇదే ఇండియన్ సినిమా నుంచి హైయెస్ట్ రిలీజ్ అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి పుష్ప 2 తో మాత్రం సరికొత్త రికార్డులే నమోదు అయ్యేలా ఉన్నాయని చెప్పాలి.