అక్కడ స్లో అయ్యిన ‘పుష్ప’ రాజ్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు కొల్లగొట్టి రికార్డులు సెట్ చేసింది. మరి ఇలా యూఎస్ మార్కెట్ లో కూడా పుష్ప 2 సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది కానీ ఇపుడు అక్కడ కొంచెం నెమ్మదించినట్టు తెలుస్తుంది.

అక్కడ టార్గెట్ కి దగ్గరగా వెళుతున్న పుష్ప 2 ప్రస్తుతం కొంచెం స్లో అయ్యిందట. మరి బ్రేకీవెన్ మార్కుని పుష్ప 2 అక్కడ దాటేసి లాభాలు అందిస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే సామ్ సి ఎస్ అదనపు నేపథ్య సంగీతం అందించారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version