ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” వరల్డ్ వైడ్ గా సాలిడ్ వసూళ్లు అందుకొని దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి వచ్చి రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది. అయితే ఇటీవల వచ్చిన పలు భారీ పాన్ ఇండియా సినిమాలు తరహాలో ఇది కూడా ఓటిటి ఎంట్రీ అంత త్వరగా ఇవ్వదు అని మేకర్స్ కూడా లేటెస్ట్ గా తేల్చేసారు.
కానీ ఇది చెప్పిన తర్వాతే ఆన్లైన్ లో పుష్ప 2 తాలూకా ఫుల్ క్లారిటీతో కూడిన హెచ్ డి ప్రింట్ లీక్ అయ్యింది. అది కూడా ఒరిజినల్ ఆడియోతో కావడం గమనార్హం. మరి ఈ ప్రింట్ తమిళ్ వెర్షన్ లో లీక్ కాగా ఇపుడు ఓ డౌట్ అయితే కలుగుతుంది అని చెప్పాలి. కొన్ని రోజులు కితమే తమిళ ఇండస్ట్రీకి చెందిన భారీ సినిమా సూర్య నటించిన “కంగువా” కూడా ఓటిటి రిలీజ్ కాకుండా ఫుల్ హెచ్ డి ప్రింట్ లీక్ అయ్యింది.
మరి అది తమిళ్ నుంచే లీక్ కావడం ఇపుడు పుష్ప 2 కూడా మొదట తమిళ్ వెర్షన్ లోనే బయటకి రావడం అనేది అక్కడి సాంకేతిక లోపాలు చూపిస్తున్నాయి. లేదా అక్కడ నుంచే ఎవరో లీక్ చేసి ఉండొచ్చు అని చెప్పాలి. మరి మేకర్స్ ఇలాంటి విషయాల్లో ఇంత అజాగ్రత్తగా ఉంటారా అని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మరి మొన్న కంగువా ఆ ప్రింట్ లీక్ తో అనుకున్న దానికంటే ముందే ఓటిటిలో రిలీజ్ చేసేసారు. మరి పుష్ప మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.