ఓటిటిలో “పుష్ప 2”.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్..

ఓటిటిలో “పుష్ప 2”.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్..

Published on Jan 30, 2025 8:08 AM IST

ఇటీవల పాన్ ఇండియా వైడ్ గా సంచలనం రేపిన తెలుగు సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే దర్శకుడు సుకుమార్ ల కలయికలో వచ్చిన భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” అనే చెప్పాలి. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి రికార్డు వసూళ్లు థియేటర్స్ లో అందుకోగా ఇపుడు ఫైనల్ గా ఓటిటి ఎంట్రీ కూడా ఇచ్చేసింది.

ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇపుడు ఈ సినిమా ఫైనల్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయితే ఈ సినిమా రావడంలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్ కనిపిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ సహా పుష్ప టీం వారు కూడా ఒక్క కన్నడ మినహా మిగతా నాలుగు భాషలు తెలుగు, హిందీ, తమిళ్, మళయాళంలో సినిమా ప్రస్తుతం అందుబాటులో ఉందని కన్నడ తర్వాత యాడ్ చేస్తామని తెలిపారు.

కానీ నెట్ ఫ్లిక్స్ లో డౌన్లోడ్ వెర్షన్ కి కేవలం పుష్ప 2 ఇపుడు తెలుగు, హిందీ, తమిళ్ లో మాత్రమే అందుబాటులో కనిపిస్తుంది. దీనితో డౌన్లోడ్ చేసుకునేవారికి ఇదొక ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఇక మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే పుష్ప 2 ది రూల్ రీలోడెడ్ వెర్షన్ ఇపుడు వస్తే ఇది కాకుండా పుష్ప 2 ది రూల్ 3 గంటల 20 నిమిషాల వెర్షన్ ని కూడా నెట్ ఫ్లిక్స్ తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ ప్లాన్ ఎందుకు చేసారో అనేది చాలామందికి అర్ధం కావట్లేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు