ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ ‘పుష్ప 2’ పాత రికార్డులను షేక్ చేసింది.
ఈ సినిమా 32 రోజుల్లో ఏకంగా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి ఇప్పుడు చరిత్ర లిఖించింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కనీవిని ఎరుగని రీతిలో ఈ మూవీ 32 రోజుల్లో ఏకంగా రూ.1831 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇలా ఓ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను రప్పా రప్ప అంటూ బద్దలుకొట్టడంతో ఇప్పుడు మరోసారి ‘పుష్ప 2’ హాట్ టాపిక్‌గా మారింది.
అల్లు అర్జున్ నట విశ్వరూపం తో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.
#Pushpa2TheRule is now Indian Cinema’s INDUSTRY HIT with THE HIGHEST EVER COLLECTION FOR A MOVIE IN INDIA ????
The WILDFIRE BLOCKBUSTER crosses a gross of 1831 CRORES in 32 days worldwide ????????#HistoricIndustryHitPUSHPA2
Book your tickets now!
????️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/sh7UN5RXLE— Pushpa (@PushpaMovie) January 6, 2025