అప్పుడే ఇండియా ట్రెండ్స్ లో “పుష్ప 2” జాతర!

అప్పుడే ఇండియా ట్రెండ్స్ లో “పుష్ప 2” జాతర!

Published on Jan 31, 2025 1:36 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సెన్సేషనల్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ చిత్రం పుష్ప 2 కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధించి దుమ్ము లేపింది. అయితే ఈ చిత్రం థియేటర్స్ లో ఇంకా డీసెంట్ రన్ కొనసాగిస్తున్నప్పటికీ ఫైనల్ గా ఓటిటి ఎంట్రీ కూడా ఇచ్చేసింది. అయితే ఈ దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెక్స్ట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ సినిమా నేటితో పాన్ ఇండియా అన్ని ముఖ్య భాషల్లో కూడా వచ్చేసింది.

అయితే ఈ సినిమా ఈ ఒక్క రోజులోనే ఇండియన్ ఛార్ట్స్ లోకి వచ్చేసింది. లేటెస్ట్ గా ఇండియా వైడ్ గా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ అదరగొడుతుంది. మరి అల్లు అర్జున్ సినిమాలకి నెట్ ఫ్లిక్స్ కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక పుష్ప 2 చేసే మాస్ జాతర ఏ లెవెల్లో కొనసాగుతుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్, సామ్ సి ఎస్ లు సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు