ఆ రికార్డులో తొలి భారతీయ సినిమాగా ‘పుష్ప 2’ !

ఆ రికార్డులో తొలి భారతీయ సినిమాగా ‘పుష్ప 2’ !

Published on Dec 16, 2024 3:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నిన్న ఆదివారం ఈ సినిమా రూ.104 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రిలీజైన 11వ రోజున రూ.100+ కోట్లు రాబట్టిన తొలి భారతీయ సినిమాగా పుష్ప 2 నిలిచిందని అంటున్నారు. పైగా ప్రస్తుతం ‘పుష్ప-2’ అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలిచిందట. మొదటి స్థానంలో ‘దంగల్’ ఉండగా, రెండో స్థానంలో బాహుబలి-2 ఉంది. ఆ తర్వాత ప్లేస్ ‘పుష్ప 2’దే కావడం నిజంగా విశేషమే.

కాగా అటు హిందీ బెల్ట్‌లో కూడా ‘పుష్ప 2’ భారీ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. గతంలో జవాన్, స్ట్రీ 2, గదర్ 2, బాహుబలి 2, మరియు పఠాన్‌ చిత్రాలు కలిగి ఉన్న రికార్డులను బద్దలు కొట్టి, ‘పుష్ప 2’ వేగంగా హిందీలో 500 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించాడు.

ఇక సపోర్టింగ్ క్యాస్ట్‌లో జగపతి బాబు, సునీల్, అనసూయ మరియు రావు రమేష్ వంటి నటీనటులు నటించారు. కాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు