హిందీలో “పుష్ప 2” లేటెస్ట్ వసూళ్లు ఎంతంటే..

హిందీలో “పుష్ప 2” లేటెస్ట్ వసూళ్లు ఎంతంటే..

Published on Dec 11, 2024 2:06 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా టోటల్ ఇండియా వైడ్ గా భారీ వసూళ్లతో దుమ్ము లేపుతుంది. అయితే పుష్ప 2 హిందీ వెర్షన్ లో రికార్డు వసూళ్లు అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇలా ఒక్క హిందీ వెర్షన్ లో 5 రోజుల్లో సుమారు 340 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇపుడు 6 వ రోజు కూడా సాలిడ్ నంబర్స్ ని సెట్ చేసింది అని చెప్పాలి. ఇలా 6వ రోజు పుష్ప 2 హిందీలో 339 కోట్ల నెట్ వసూళ్లు అందుకోగా మొత్తం 6 రోజుల్లో పుష్ప 2, 36 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి ఇపుడు ఏకంగా 375 కోట్ల క్లబ్ లోకి చేరి ఇప్పుడు 400 కోట్ల దగ్గరకి వచ్చేస్తుంది అని చెప్పాలి.. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు