ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సాలిడ్ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఫాస్టెస్ట్ 1000 కోట్ల సినిమాగా నిలిచి సంచలనం సెట్ చేసింది. ఇక ఈ చిత్రం యూఎస్ వసూళ్లు ఇప్పుడు తెలుస్తున్నాయి.
వీక్ డేస్ లోకి వచ్చిన పుష్ప 2 అక్కడ కొంచెం డల్ కాగా ఇపుడు 11 మిలియన్ డాలర్లు గ్రాస్ దిశగా కొనసాగుతుంది. లేటెస్ట్ గా సినిమా 10.8 మిలియన్ డాలర్లు గ్రాస్ మార్క్ ని టచ్ చేసేసింది. ఇక నెక్స్ట్ స్టాప్ 11 మిలియన్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.