ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఇక సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ ఈ మూవీ తన మేనియా చూపిస్తోంది.
ఇప్పటికే హిందీలో హయ్యెస్ట్ నెట్ వసూళ్లు సాధించిన మూవీగా ‘పుష్ప-2’ రికార్డు సాధించింది. ఇక ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా కూడా కళ్లు చెదిరే నెంబర్స్‌తో దూసుకుపోతుంది. అయితే, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కి సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు చెక్ పెట్టారు మేకర్స్.
‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే ప్రసక్తే లేదు. 56 రోజుల తరువాతే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది.. అప్పటివరకు పుష్ప 2 వైల్డ్‌ఫైర్‌ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి.. అంటూ మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
There are rumours floating around about the OTT release of #Pushpa2TheRule
Enjoy the Biggest Film #Pushpa2 only on the Big Screens in this Biggest Holiday Season ❤️
It won't be on any OTT before 56 days!
It's #WildFirePushpa only in Theatres Worldwide ????
— Mythri Movie Makers (@MythriOfficial) December 20, 2024